Breaking News

మీ కంప్యూటర్ కు పెన్ డ్రైవ్ తో తాళం వేసుకోండి!

Thursday 29 January 2015

మీ కంప్యూటర్ కు పెన్ డ్రైవ్ తో తాళం వేసుకోండి!

 
దీనిలొ మొదటి ఆప్షన్ అయిన  "Enable" అనేది క్లిక్  చేసినపుడు మనకు క్రింది విధమైన మెసేజ్ ఇస్తుంది. 
అదే విధంగా మనం "Disable" అనేది క్లిక్ చేసినపుడు  మనకు క్రింది విధమైన మెసేజ్ వస్తుంది.






లేటెస్ట్ వెర్షన్ 3.0  ఇపుడు మనకు అందుబాటులొ ఉంది.









మనం ఎక్కువగా ఉపయోగించే USB storage device పెన్ డ్రైవ్ లేదా మెమొరీ కార్డ్ ను ఉపయోగించి మన కంప్యూటర్ కు తాళం వేయవచ్చు. క్రింది సోపానాలను గమనించండి
1. ఈ Active Key ప్రోగ్రాం ను రన్ చేసినపుడు మనకు పైన చూపించిన మొదటి ఇమేజ్ లా ఓపెన్ అవుతుంది.
2. మన USB storage device ను కంప్యూటర్ లొ ఇన్సర్ట్ చేసిన తర్వాత USB key drive అనేదానిలొ దాని డ్రైవ్ లెటర్ చూపిస్తుంది.
3. ఇపుడు మనం Lock computer when USB key removed అనేది చెక్ చేయాలి.
4. తర్వాత "Enable" అని ఉన్న బటన్ ను క్లిక్ చేయాలి.మనం USB storage device ను ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ బటన్ ను క్లిక్ చేసినపుడు క్రింది విధంగా వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ధీనికి, మనం USB storage device ఇన్సర్ట్ చేయకుండా "Enable" బటన్: క్లిక్ చేసినపుడు వచ్చిన మెసేజ్ (పైన చూపించిన 2 వ ఇమేజ్ చూడండి) కి తేడా చూడండి. మీ USB key పోగొట్టుకోవద్దని వార్నింగ్ ఇస్తుంది. అది పోగొట్టుకుంటే వేరెవరో కాదు, మీరు కూడా మీ కంప్యూటర్ తాళం ను తీయలేరు. జాగ్రత్త సుమా!






5. ఇపుడు మనం Safely Remove Hardware విధానంలో మనం మన USB storage device ను రీమూవ్ చేస్తాం.















అలా రిమూవ్ చేసినపుడు కంప్యూటర్ ను లాక్ చేసేస్తుంది. దానితో పాటు Please insert USB key అనే డైలాగ్ బాక్స్ వస్తుంది.
పై విధంగా ఒక USB storage device తో అనేక కంప్యూటర్లను తాళం వేయవచ్చు లేదా అనేక కంప్యూటర్లను వేరే వేరే USB storage device లతో తాళం వేయవచ్చు. కాని దానిని మాత్రం పోగొట్టుకోండి, సిస్టం రీబూట్ చేసినా అది లేనిదే తాళం తెరుచుకోదు.
Share

No comments:

Post a Comment

 
Copyright © 2015 TECH 2 TELUGU
Design By G.venkatGoud | Mobile No : +918374174108