Breaking News

బాడ్ సెక్టార్స్ ఏర్పడిన హార్డ్ డిస్క్ ను పునరుజ్జీవింపచేయండి

Thursday 29 January 2015

బాడ్ సెక్టార్స్ ఏర్పడిన హార్డ్ డిస్క్ ను పునరుజ్జీవింపచేయండి


ప్రతి కంప్యూటర్ లోనూ అంతర్గతంగా ఉండే అతి ముఖ్యమైన పరికరాలలో హార్డ్ డిస్క్ ఒకటి. దీనిలోనే మన డాటా, సమాచారం అంతా ఇమిడి ఉంటుంది. భౌతికంగా పాడైన హార్డ్ డిస్క్ లను మరల పూర్వ స్థితికి తీసుకు వచ్చే సాఫ్ట్ వేర్ HDD Regenerator. మిగతా కొన్ని సాఫ్ట్ వేర్ ల వలె ఇది బాడ్ సెక్టార్ లను హైడ్ చేయటమే కాకుండా వాటిని రిస్టోర్ చేయటం దీని ప్రత్యేకత. హార్డ్ డిస్క్ ల పరంగా చూస్తే సాధారణంగా మనకు ఏర్పడే సమస్య ల లో హార్డ్ డిస్క్ ఉపరితలం మీద బాడ్ సెక్టార్లు ఏర్పడటం ఎక్కువగా కనపడుతుంటుంది. ఈ బాడ్ సెక్టార్లను రీడ్ చేయటం అనేది సాధ్యపడదు. కాని వాటిలో ముఖ్య మైన సమాచారం లేదా డాటా నిక్షిప్తమై ఉండవచ్చు. బాడ్ సెక్టార్స్ కారణంగా మనం మన హార్డ్ డిస్క్ లో ఉండే డాటాను రీడ్ చేయటం, కాపి చేయటం లాంటి విషయాలలో ఇబ్బందులు ఏర్పడతాయి, అలాగే మన ఆపరేటింగ్ సిస్టం కూడా అన్ స్టేబుల్ గా అవ్వోచ్చు., లేదా అసలు మన కంప్యూటరే బూట్ కాకుండా పోవచ్చు. కాబట్టి హార్డ్ డిస్క్ పై బాడ్ సెక్టార్లు ఏర్పడితే మన హార్డ్ డిస్క్ పనికి రాకుండా పోవచ్చు లేదా దానిలోని సమాచారం లేదా డాటా మొత్తం మనం కోల్పోవచ్చు. కాని HDD Regeneratorఅలాంటి దెబ్బతిన్న హార్డ్ డిస్క్ లను వాటి లొని డాటాకు ఎలాంటి హాని జరుగకుండా, లేదా డాటాను మార్చకుండా రిపేర్ చేస్తుంది. ఆ విధంగా ఇంతకు ముందు రీడ్ చేయలేని లేదా యాక్సెస్ చేయలేని హార్డ్ డిస్క్ లను సాధారణ స్థితికి తీసుకువస్తుంది.


ఇదెలా పనిచేస్తుంది?

దాదాపుగా బాడ్ సెక్టార్ ల వల్ల పాడైన హార్డ్ డిస్క్ డ్రైవ్ ల లొ 60% డిస్క్ ఉపరితలం సరైన విధంగా మాగ్నెటైజ్ చేయబడి ఉండకపోవటమే. లో లెవెల్ డిస్క్ ఫార్మాటింగ్ వలన కూడా సాధ్యపడని హార్డ్ డిస్క్ ల భౌతిక రిపేర్ ను ఈ సాఫ్ట్ వేర్ చేయగలుగుతుంది.ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించే ఆల్గోరిధమ్ వలన ఎలాంటి సమాచార లేదా డాటా నష్టం కలుగుకుండా హార్డ్ డిస్క్ మరల వినియోగించేందుకు అనువుగా రిపేర్ చేయబడుతుంది.


HDD Regenerator మీ డ్రైవ్ ను రిపేర్ చేస్తుందా?

బాడ్ సెక్టార్ ల వల్ల పాడైన హార్డ్ డిస్క్ ల లో దాదాపుగా 60 % వరకు ఈ సాప్ట్ వేర్ రీజనరేట్ చేయ గలుగుతుంది. దీనికి గాను మనం ముందుగా ఈ సాఫ్ట్ వేర్ యొక్క అన్- రిజిస్టర్డ్ డెమో వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగించి మొదటి బాడ్ సెక్టార్ ను రీజనరేట్ చేయటానికి ప్రయత్నించి చూడవచ్చు. ఆ విధంగా మన హార్డ్ డిస్క్ ను మరల వినియోగం లోకి ఈ సాఫ్ట్ వేర్ యొక్క రిజిస్టర్డ్ ఫుల్ వెర్షన్ తీసుకురాగలదా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు. సఫలీకృతం అయితే ఫుల్ వెర్షన్ కొనుక్కుని ఉపయోగించవచ్చు. ఒక వేళ ఫస్ట్ బాడ్ సెక్టార్ విజయవంతంగా రీజనరేట్ కాకపోతే ఇక మనం కొత్త హార్డ్ డిస్క్ తీసుకోవటమే చేయాలి.
ఒక ముఖ్య విషయం:
ఈ సాఫ్ట్ వేర్ మన హార్డ్ డ్రైవ్ యొక్క లాజికల్ స్ట్రక్చర్ లొ ఎలాంటి మార్పులు చేయదు, కనుక ఫైల్ సిస్టం రీజనరేషన్ కు ముందు చూపిన బాడ్ సెక్టార్ లను రీజనరేట్ అయిన తర్వాత కూడా ఇంకా బాడ్ సెక్టార్ లు గానే చూపిస్తుంది. అందువలన Scandisk లాంటి డిస్క్ యుటిలిటీస్ లో చూసినపుడు ఎలాంటి భౌతిక మైన బాడ్ సెక్టార్ లు లేనప్పటికీ, విజయవంతంగా బాడ్ సెక్టార్లు రీజనరేట్ అయినపప్పటికీ వాటిని బాడ్ సెక్టార్ లు గానే చూపిస్తుంది. ఈ విధంగా మనకు ఇలాంటి బాడ్ సెక్టార్ మార్క్స్ కనపడకూడదనుకుంటే మన డాటాను సురక్షితంగా బాక్ అప్ చేసుకుని ఆ హార్డ్ డిస్క్ ను రీ పార్టిషన్ చేసుకోవాలి. 
మరిన్ని వివరాలకు, డెమో వెర్షన్ డౌన్ లోడ్ కు క్రింది లింక్ లోకి వెళ్లండి.
Share

No comments:

Post a Comment

 
Copyright © 2015 TECH 2 TELUGU
Design By G.venkatGoud | Mobile No : +918374174108